భీమవరంలోఇటీవల జరిగిన స్టోర్ లాంచ్ ఈవెంట్ కోసం తాను ఉపయోగించిన వాహనాన్ని ప్రభుత్వ అధికారులు తనకు పంపారని మీడియాలో వచ్చిన వార్తలను నటి నిధి అగర్వాల్ కొట్టిపారేసింది. ఆ వాహనాన్ని ఎంచుకోవడంలో లేదా అభ్యర్థించడంలో తనకు ఎటువంటి పాత్ర లేదని, దానిని కేవలం లాజిస్టికల్ ప్రయోజనాల కోసం ఈవెంట్ నిర్వాహకులు మాత్రమే అందించారని స్పష్టం చేశారు.