డేటా సెంటర్ AI స్టోరేజ్ డిమాండ్‌: 30TB డ్రైవ్‌లను రవాణా చేస్తున్న సీగేట్

ఐవీఆర్

మంగళవారం, 5 ఆగస్టు 2025 (21:16 IST)
మాస్-కెపాసిటీ డేటా స్టోరేజ్‌లో ప్రపంచ అగ్రగామి అయిన సీగేట్ టెక్నా లజీ హోల్డింగ్స్ పిఎల్‌సి, ఈరోజు 30TB వరకు ఎక్సోస్ M, ఐరన్‌వోల్ఫ్ ప్రో హార్డ్ డ్రైవ్‌ల గ్లోబల్ ఛానల్ లభ్యతను ప్రకటించింది. ఈ డ్రైవ్‌లు సీగేట్ మొజైక్3+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమయ్యాయి. హీట్-అసిస్టెడ్ మాగ్నెటిక్ రికార్డింగ్ (HAMR) టెక్నాలజీ ద్వారా శక్తిని పొందే ఈ డ్రైవ్‌లు సంప్రదాయ ఎంటర్‌ప్రైజ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుబంధంగా ఉన్న ఏఐ విస్తరణల పెరుగుదల ద్వారా నడిచే స్కేలబుల్, అధిక-పనితీరు గల స్టోరేజ్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఒక మిలియన్ మొజైక్ హార్డ్ డ్రైవ్‌లు రవాణా చేయబడటంతో, సీగేట్ కేవలం ఒక మైలురాయి కంటే ఎక్కువ సాధిం చింది- ఇది దాని సంచలనాత్మక స్టోరేజ్ సాంకేతికత బలం, పరిపక్వతను నొక్కి చెప్పే నిర్వచించే క్షణాన్ని గుర్తిం చింది.
 
‘‘నేడు, ప్రపంచంలోని దాదాపు 90% డేటా కేవలం 10 దేశాలలోనే స్టోర్ చేయబడింది. అయితే, దాదాపు 150 దేశాలు డేటా సావర్జినిటీకి ప్రాధాన్యం ఇస్తుండడంతో డేటా గ్రావిటీ అనేది నెట్‌వర్క్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపున ఏఐ పనిభారాలు విస్తరిస్తూనే ఉన్నాయి. డేటాసెంటర్లు- ఆన్-ప్రేమ్, ప్రైవేట్, సావరిన్- తమ ప్రొప్రైటరీ డేటా విలువను పొందడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి’’ అని సీగేట్‌లోని ఎడ్జ్ స్టోరేజ్ అండ్ సర్వీసెస్ SVP మెలిస్సా బండా అన్నారు. ‘‘మా 30TB డ్రైవ్‌లు వేగంగా పెరుగుతున్న ఈ ధోరణులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడ్డాయి. ఏఐ పనిభారాలకు శక్తినివ్వడానికి అవసరమైన సామర్థ్యం, తట్టుకునే శక్తిని అందిస్తాయి’’ అని అన్నారు.
 
ప్రాథమిక డేటా నిర్వహణ, మౌలిక సదుపాయాల మార్పులకు అనుగుణంగా మారుతున్న పరిశ్రమ అగ్రగామి సంస్థలు: "హైపర్‌స్కేలర్లు, ఎంటర్‌ప్రైజ్ డేటా సెంటర్‌లు ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయి పోటీలో ప్రారంభ దశలో ఉన్నాయి, ఫలితంగా పనితీరు-ఆధారిత హార్డ్‌వేర్‌పై మూలధన వ్యయం వేగంగా పెరుగు తోంది" అని ఐడీసీ హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ రీసెర్చ్ డైరెక్టర్ ఎడ్ బర్న్స్ అన్నారు. ‘‘తక్కువ జాప్యం వంటి పనితీరుతో తరచుగా సంబంధం కలిగి ఉండకపోయినా, అత్యధిక సామర్థ్యం గల హెచ్‌డిడిలు ఏఐ అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన వ్యూహాత్మక ఆస్తి. నేడు, భవిష్యత్తులో మార్కెట్లో అత్యున్నత నాణ్యత గల ఏఐ మోడళ్లను నిర్మించడానికి, మెరుగుపరచడానికి అవసరమైన ప్రాథమిక డేటా భారీ సామర్థ్య నిల్వ అవసరాన్ని ఇవి తీరుస్తాయి.
 
ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లు తమ డేటా సెంటర్‌ల సాంద్రతను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. విద్యుత్ వినియోగం, చదరపు ఫుటేజ్ అవసరాలను తగ్గిస్తూ స్టోరేజ్ వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కొనసాగించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. సీగేట్ యొక్క కొత్త 30TB ఎక్సోస్ నేడు పరిశ్రమలో అందించబడుతున్న అత్యధిక సాంద్రత కలిగిన హార్డ్ డ్రైవ్. మాస్-కెపాసిటీ స్టోరేజ్ కోసం సరైన పనితీరు, వ్యయ ట్రేడ్‌ఆఫ్‌ల కోసం చూస్తున్న హైపర్‌స్కేల్, ఎంటర్‌ప్రైజ్ డేటా సెంటర్ కస్టమర్లు సీగేట్ HAMR ప్రోడక్ట్ రోడ్‌మ్యాప్ నుండి ప్రయోజనం పొందుతారు, ఇది రాబోయే సంవత్సరాల్లో HDDల కోసం ఏరియల్ డెన్సిటీ వృద్ధి రేటును వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.
 
HPE అంచనా ప్రకారం ఆన్-ప్రీమ్ ఏఐ మార్కెట్ 90% సీఏజీఆర్‌తో వృద్ధి చెంది, మూడు సంవత్సరాలలో $42 బిలియన్లకు చేరుకుంటుంది. ఏఐ ఫ్యాక్టరీలను ‘‘భారీస్థాయిలో ఇంటెలిజెన్స్‌ను తయారు చేయడానికి రీఇమేజిన్ చేయబడిన డేటా సెంటర్‌లు"గా NVIDIA అభివర్ణిస్తుంది. ఇది ఏఐ జీవితచక్రంలో డేటాను రియల్-టైమ్ ఇన్ సైట్స్‌గా మార్చడానికి అవసరం. వ్యాపార వ్యూహానికి ఏఐ  కేంద్రంగా మారుతున్నందున, స్టోరేజ్‌ను ఆధునీకరించడం అనేది ఐచ్ఛికం కాదు- ఇది పునాది. ఆన్-ప్రేమ్ AI కోసం సరైన సమయంలో 30TB హైపర్‌స్కేల్-గ్రేడ్ ఎక్సోస్-NAS-ఆప్టిమైజ్డ్ ఐరన్‌వోల్ఫ్ ప్రో
 
ఎడ్జ్ ఏఐ ఇకపై భవిష్యత్ భావన కాదు, అది ఇప్పుడు జరుగుతోంది. ఐడీసీ ప్రకారం, రిటైల్, తయారీ, ఆర్థిక సేవల వంటి పరిశ్రమలు వీడియో విశ్లేషణలు, ప్రిడిక్టివ్ నిర్వహణ, మోసాన్ని గుర్తించడం కోసం ఏఐని చురుకుగా అమలు చేస్తున్నాయి. ఈ మార్పు మరింత సరళమైన, స్కేలబుల్ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి స్టోరేజ్  నుండి కంప్యూట్‌ను విడదీసే డిస్అగ్రిగేటెడ్ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ స్వీకరణను వేగవంతం చేస్తోంది. సీగేట్ ఎక్సోస్ M 30TB డ్రైవ్ అధిక-సామర్థ్యం, శక్తి-సమర్థవంతమైన స్టోరేజ్ కోసం పెరిగిన డిమాండ్‌ను తీర్చడా నికి నిర్మించబడింది. ఇది సంస్థలకు స్టోరేజ్‌ను అధికం చేయడానికి, డేటా ప్లేస్‌మెంట్‌ను ఆప్టిమైజ్ చేయడానికి, పనితీరు లేదా స్థిరత్వాన్ని రాజీ పడకుండా రియల్-టైమ్ ఎడ్జ్ అనలిటిక్స్‌కు మద్దతు ఇవ్వడానికి సాధికారికత ఇస్తుంది.
 
ఏఐ-ఆధారిత అప్లికేషన్లు విస్తరించే కొద్దీ, ఆన్-ప్రిమైజ్ NAS వ్యవస్థలు తెలివైన డేటా హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి- వీడియో అనలిటిక్స్, ఇమేజ్ రికగ్నిషన్, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ జనరేషన్(RAG), ఇన్ఫెరెన్సింగ్ వంటివి అధునాతన పనిభారాలకు మద్దతు ఇస్తాయి. AI, IoT, హైబ్రిడ్ క్లౌడ్ కన్వర్జెన్స్ తక్కువ జాప్యం, అధిక సమగ్రతతో పెద్ద, అన్ స్ట్రక్చర్డ్ డేటాసెట్‌లను నిర్వహించగల అధిక-సామర్థ్యం, అధిక-సమగ్రత NAS పరిష్కారాల కోసం డిమాండ్‌ను పెంచుతోంది. డిజిటల్ పరివర్తన, ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్ పెరుగుదల కారణంగా, 2034 నాటికి ప్రపంచ NAS మార్కెట్ 17% కంటే ఎక్కువ CAGRతో వృద్ధి చెందుతుందని ఇటీవలి మార్కెట్ విశ్లేషణ అంచనా వేసింది.
 
‘‘QNAP NAS వ్యవస్థలు ఆన్-ప్రిమైజ్ ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. స్థానిక ఏఐ మోడళ్లను అమలు చేయడానికి, స్థానిక డేటాసెట్‌లను ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి RAG, LLM సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి సంస్థలకు వీలు కల్పిస్తుంది’’ అని QNAP ప్రోడక్ట్ మేనేజర్ ధవల్ పనారా అన్నారు. ‘‘సీగేట్ ఐరన్‌వోల్ఫ్ ప్రో 30TB డ్రైవ్‌లను సమగ్రపరచడం ద్వారా మేం పెటా బైట్-స్కేల్, హై-ఇంటిగ్రిటీ స్టోరేజ్‌ను అందిస్తాం, ఇది వేగవంతమైన యాక్సెస్, నమ్మకమైన పనితీరు, ఉన్నత స్థాయి స్కేలబుల్ మౌలిక సదుపాయాలను నిర్ధారిస్తుంది’’ అని అన్నారు.
 
‘‘ఏఐ వర్క్ లోడ్స్ అనేవి ఎడ్జ్ ఎన్విరాన్మెంట్లకు మారడం పెరుగుతున్నందున, స్థానిక డేటా ప్రాసెసింగ్‌కు నమ్మకమైన అధిక-సామర్థ్య స్టోరేజ్ కీలకంగా మారుతుంది. సీగేట్ ఐరన్‌వోల్ఫ్ ప్రో 30TB డ్రైవ్‌లు UGREEN NAS వ్యవస్థలకు అవసరమైన బలమైన పునాదిని అందిస్తాయి- భారీ స్కేలబిలిటీని మరియు స్థానిక ఏఐ అప్లికేషన్‌లకు అవసరమైన కార్యాచరణ స్థిరత్వాన్ని అందిస్తాయి," అని UGREEN ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ ఇవాన్ లి అన్నారు.
 
లభ్యత: Exos M 30TB డ్రైవ్ ఇప్పుడు భారతదేశంలో సీగేట్ అధీకృత భాగస్వాముల ద్వారా సూచించబడిన రిటైల్ ధర(SRP) రూ. 74,999కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. IronWolf Pro 30TB డ్రైవ్ ధర సూచించబడిన రిటైల్ ధర (SRP) రూ. 75,999, అభ్యర్థనపై అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు, కొనుగోలు విచారణల కోసం, వినియోగదారులు వారి స్థానిక సీగేట్ పంపిణీదారులను లేదా అధీకృత రీసెల్లర్స్‌ను సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు