స్విగ్గీపై కస్టమర్ల ఫైర్.. ఆకలితో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా చేస్తారా?

శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:44 IST)
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు. దీంతో చాలామంది కస్టమర్లు సరైన టైమ్‌కు ఫుడ్ అందక ఇబ్బంది పడ్డారు. దాదాదాపు 152 మందికి ఆర్డర్లు చేతికి అందలేదు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది.
 
ఆర్డర్ చేసిన ఆహారం సరిగ్గా అందకపోవడంతో ఆ యాప్ నుంచి భారీగా వెలుపలికి వచ్చినట్లు విచారణలో తేలింది. ఇదే తరహాలో ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ కూడా సాయంత్రం పూట స్విగ్గీలో కస్టమర్లు ఆర్డర్ చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు స్విగ్గీ సేవలు బంద్ కావడంపై వినియోగదారులు ఫైర్ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు