చివరి అంచె డెలివరీలలో నూతన శకం ప్రారంభించేందుకు ఏస్ ఈవీ డెలివరీలను ప్రారంభించిన టాటా మోటార్స్

సోమవారం, 9 జనవరి 2023 (19:02 IST)
భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ నేడిక్కడ, భారతదేశ అత్యంత అధునాతన, జీరో- ఎమిషన్, ఫోర్ వీల్ చిన్నతరహా వాణిజ్య వాహనాల్లో సరికొత్త ఏస్ ఈవీ ఇంట్రా-సిటీ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌కు సుస్థిరదాయకత మొబిలిటీ పరిష్కారాలు అందించడంలో గణనీయ ముందడుగు వేసింది. అగ్రగామి ఇ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, కొరియర్ కంపెనీలు, వాటి లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన అమెజాన్, డెలివరీ, డీహెచ్ఎల్ (ఎక్స్ ప్రెస్ అండ్ సప్లయ్ చెయిన్), ఫెడ్ ఎక్స్, ఫ్లిప్ కార్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ కన్జ్యూమర్ హెల్త్, మూవింగ్, సేఫెక్స్ ప్రెస్, ట్రెంట్ లిమిటెడ్ లకు విప్లవాత్మక ఏస్ ఈవీలు డెలివరీ చేయబడ్డాయి.

 
దాని వినియోగదారులతో కలసి మరింతగా అభివృద్ధి చేయబడి, 2022 మేలో ఆవిష్కరించబడిన నూతన ఏస్ ఈవీ క్షేత్రస్థాయిలో మార్కెట్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. శ్రద్ధగా క్యూరేట్ చేయబడిన ఎకో సిస్టమ్ మద్దతు కలిగిన ఏస్ ఈవీ ఇబ్బందిరహిత ఇ-కార్గో మొబిలిటీకి సమగ్ర పరిష్కారంతో, 5-ఏళ్ల సమగ్ర మెయింటెనెన్స్ ప్యాకేజ్‌తో వస్తుంది. 100% అప్ టైమ్ పటిష్ఠ పనితీరు కొనుగోలుదారుల నుంచి అమిత ఆదరణ పొందింది. ఏస్ ఈవీ సపోర్టింగ్ ఎకో సిస్టమ్ అనేది ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఏర్పాటు, గరిష్ఠ ఫ్లీట్ అప్‌టైమ్ కోసం డెడికేటెడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ సపోర్ట్ సెంటర్స్ ఏర్పాటు, రేపటి తరం ఆప్టిమల్ ఫ్లీట్ మేనేజ్ మెంట్ సొల్యూషన్ అయిన టాటా ఫ్లీట్ ఎడ్జ్, టాటా యూనిఇవర్స్, సంబంధిత టాటా గ్రూప్ కంపెనీల నిరూపిత ఎనేబ్లింగ్ ఎకో సిస్టమ్, ఫండింగ్ పొందేందుకు దేశ అగ్రగామి ఫైనాన్షియర్స్‌తో భాగస్వామ్యాలతో కూడుకొని ఉంటుంది.

 
ఏస్ ఈవీల మొదటి ఫ్లీట్‌ను టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీశ్ వాఘ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘భారతీయ రహదారులపై ఏస్ ఈవీలను ప్రవేశపెట్టడం అనేది ఉద్గారాలు లేని సరుకు రవాణా దిశగా ఒక పెద్ద ముందడుగు. మా భాగస్వాములతో కలసి రూపొందించిన ఈ సమగ్ర పరిష్కారం వివిధ రకాల అంతర్ సిటీ పంపిణి అవసరాలను ప్రభావపూరితంగా తీరుస్తుంది. దీనితో ముడిపడిన వారందరికీ అత్యున్నత స్థాయి విలువను అందిస్తుంది. మా కస్టమర్లు మాపై ఉంచిన విశ్వాసానికి, అందిస్తున్న మద్దతుకు మా ధన్యవాదాలు. ఏస్ ఈవీకి వారు అందిస్తున్న ప్రోత్సాహం సుస్ధిరదాయక చలనశీలత దిశగా మా ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మాకు స్ఫూర్తినిస్తుంది మరియు నెట్- జీరో పట్ల దేశం ఆకాంక్షలకు మద్దతునిస్తుంది’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు