ఈ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్ షోరూమ్‌లలో 21,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు రద్దు చేసినా, 3-4 రోజుల్లో డబ్బు వాపసు చేయబడుతుంది. టాటా పంచ్ EV వేరియంట్లు మరియు వాటి ముఖ్య ఫీచర్లు వెల్లడయ్యాయి.
టాటా పంచ్ EV స్మార్ట్ ఫీచర్స్ సంగతికి వస్తే.. ఇది కొత్త ఎలక్ట్రిక్ SUV బేస్ వేరియంట్. ఇది LED హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డిజిటల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో వస్తుంది. ఇది మల్టీ-మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది.
భద్రత విషయానికొస్తే, ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ EV అడ్వెంచర్‌లో, స్మార్ట్ వేరియంట్ ఫీచర్లతో పాటు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఐచ్ఛిక సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, 17.78cm హర్మాన్ టచ్‌స్క్రీన్.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay-Android ఆటో కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా రానుంది.16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, 17.78 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ పొందుతుంది. ఇంకా పిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 26.03 సెం.మీ హర్మాన్ టచ్‌స్క్రీన్ HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. ఆటో ఫోల్డ్ ORVM, ఆప్షనల్ సన్‌రూఫ్, SOS ఫీచర్లు కూడా వస్తున్నాయి.
బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్-360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. టాటా పంచ్ EV ధర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా, ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షలు- రూ. 14 లక్షల మధ్యలో ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది.