తాజా ప్యాకేజింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల గౌరవాన్ని వేడుక చేస్తున్న టాటా టీ చక్ర గోల్డ్‌

సోమవారం, 11 అక్టోబరు 2021 (22:54 IST)
తమ తాజా బ్రాండ్‌ కార్యక్రమంలో భాగంగా, దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్‌, టాటా టీ చక్ర గోల్డ్‌  నేడు,  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతిష్టాత్మక అంశాలను వేడుక చేస్తూ, విశాఖపట్నంలోని బీచ్‌మాల్‌ వెలుపలి భాగంలో భారీ 3 డీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షోను నిర్వహించింది. ఇరు రాష్ట్రాలకూ గర్వకారణంగా నిలిచిన  ప్రాంతీయ అంశాలను వేడుక చేయాలనే  బ్రాండ్‌ యొక్క నిబద్ధతతో పాటుగా ఈ ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రాధాన్యతా ఎంపికగా నిలువడానికి సంస్థ చేస్తోన్న ప్రయత్నాలలో భాగంగాఈ కార్యక్రమం ఉంటుంది.
 
పరిపూర్ణతను వేడుక చేసే మహోన్నత కళాత్మక సంస్కృతి సహా జీవితంలోని పలు దశల వ్యాప్తంగా సాధించిన శ్రేష్టత మరియు విజయాలకు పర్యాయపదాలుగా ఏపీ మరియు తెలంగాణా నిలుస్తాయి. టాటా టీ చక్ర గోల్డ్‌ సైతం ఖచ్చితమైన కప్పు టీ గా హాల్‌మార్క్‌గా నిలిచేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుంది. నూతన ప్యాక్‌ మరియు కార్యక్రమం ఈ అతి ముఖ్యమైన అంశంపై ఆధారపడి ఉంటుంది మరియు బ్రాండ్‌ ప్రతిపాదనను సరిగ్గా వెల్లడిస్తుంది.
 
ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలలో వినూత్నమైన కళారూపాలు అయినటువంటి కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యం మరియు కలంకారి డిజైన్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో తమ సగర్వపు ప్రతీకగా కొండపల్లి బొమ్మలను ఎక్కువ మంది అభిమానిస్తుంటారు. ఈ కళారూపానికి 400 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది మరియు వినూత్నమైన పనితనమూ దీనిలో కనిపిస్తుంది. గ్రామీణ  జీవితం, జానపదం, జంతువుల కథలను జీవితానికి తీసుకువస్తుంది.
 
ఈ వేడుకైన కళారూపానికి నివాళిని  3డీ ప్రొజెక్షన్‌ ద్వారా టాటా టీ చక్ర గోల్డ్‌ అందిస్తుంది. దీనిలో కొండపల్లి బొమ్మల కథ ఉంటుంది. పూర్తి సరికొత్త చక్ర గోల్డ్‌ ప్యాక్‌లను ప్రత్యేకంగా ఏపీ  మరియు తెలంగాణా కోసం డిజైన్‌ చేశారు. కొండపల్లి బొమ్మలను అత్యంత అందంగా ఈ ప్యాక్‌లపై ముద్రించారు. ఇవి ఈ రాష్ట్రాల మహోన్నత చరిత్రను ప్రదర్శించడమే  కాకుండా ఈ ప్రాంతాలకు ప్రత్యేకమైన కూచిపూడి నృత్యం, కలంకారి డిజైన్‌, తెలుగు లిపి మరియు వరి క్షేత్రాలు సైతం వీటిలో ప్రదర్శిస్తారు.
 
ఈ నూతన ప్యాక్‌ గురించి పునీత్‌ దాస్‌, అధ్యక్షులు, ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలలో మా బ్రాండ్‌ను మరింతగా బలోపేతం చేయాలనే మా ప్రయత్నంలో భాగంగా, మేము మా ప్యాక్‌ను  తెలుగుకు గర్వకారణంగా నిలిచే అంశాలతో నింపి విడుదల చేశాం. అత్యద్భుతమైన పనితనం కారణంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి కొండపల్లి బొమ్మలు. ఈ కళను భద్రపరుచుకోవడంతో పాటుగా భావితరాలకు అందించాల్సిన అవసరముంది. నిర్ధిష్టమైన సాంస్కృతిక అంశాలతో  వినియోగదారులను నిమగ్నం చేయడంతో పాటుగా మా హైపర్‌ లోకల్‌ వ్యూహానికి అనుగుణంగా ఉన్నందున రాష్ట్రంలోని ఇతర విభిన్నమైన కళాంశాలతో ఆసక్తికరంగా మిళితం చేసి సృజనాత్మకంగా వీటిని తీసుకురావడం పట్ల సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు