తెలుగు మహిళల బలీయమైన స్ఫూర్తికి నివాళులర్పించిన తెలంగాణాలో అగ్రశ్రేణి టీ బ్రాండ్‌ టాటా టీ జెమినీ

శనివారం, 30 జనవరి 2021 (14:56 IST)
ప్రాంతీయ గౌరవాన్ని పెంపొందించే రీతిలో, తెలంగాణాలో అతిపెద్ద టీ బ్రాండ్‌, టాటా టీ జెమినీ తమ తాజా ప్రచారాన్ని విడుదల చేసింది. ఇది ధృడమైన మనస్తత్వం కలిగిన తెలంగాణా మహిళను వేడుక చేయడంతో పాటుగా వారి ఎన్నడూ రాజీపడవద్దనే ధోరణినీ వేడుక చేస్తుంది.
 
టీ విభాగంలో తెలంగాణా మార్కెట్‌లో ఆధిప్యత్యం వహిస్తున్నప్పటికీ, ఎంతోకాలంగా తమ బ్రాండ్‌‌ను మెరుగుపరిచేందుకు టాటా టీ జెమినీ ప్రయత్నాలలో భాగంగా ఈ నూతన టీవీ వాణిజ్య ప్రకటన ఉంది. ప్యాకేజింగ్‌ ద్వారా తీసుకువచ్చిన ఈ నూతన దృశ్య గుర్తింపు ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కళారూపం కలంకారీ నుంచి  ప్రేరణ పొందింది. స్థానికంగా సంబంధితమైన ఈ మార్కెటింగ్‌ సమ్మేళనం, తెలంగాణా రాష్ట్రంతో బ్రాండ్‌ యొక్క సంబంధాన్ని స్థానిక గౌరవం ద్వారా మరింత బలోపేతం చేయనుందని అంచనా.
 
ముల్లెన్‌ లింటాస్‌ నేపథ్యీకరించిన ఈ టీవీ ప్రచారం ద్వారా సాధారణ మహిళ జీవితాన్ని మరియు తనదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలనుకునే ఆమె తపనను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రకటనలో, తెలుగు మహిళలను ఓ కారులో వెనుక కూర్చున్నట్లుగా చూపుతూనే, ఆమె జీవితంలోని పలుసంఘటనలను గుర్తుకు తెస్తారు. దానిలో తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆమె ప్రయత్నాలను ఎంతోమంది నిరుత్సాహ పడటమూ కనిపిస్తుంది. అయితే సవాళ్లను ఎదుర్కొన్నప్నటికీ ఆమె ధృడంగా వాటితో పోరాడి, తన కలలను సాకారం చేసుకుంటుంది. ఈ కమ్యూనికేషన్‌ ప్రచారం, తెలంగాణా యొక్క అసలైనగౌరవాన్ని వేడుక చేస్తుంది. అత్యుత్తమత తప్పితే మరేమీ వద్దనే తెలుగు మహిళల రాజీపడని ధోరణిని ఈ ప్రచారం  ద్వారా మరింత ప్రస్ఫుటంగా వెల్లడించారు.
 
ఈ తాజా ప్రచారం గురించి శ్రీ పునీత్‌ దాస్‌, ఎస్‌వీపీ-మార్కెటింగ్‌, ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణాలో సుప్రసిద్ధ టీ బ్రాండ్‌ టాటా టీ జెమినీ. తెలుగు లోగిళ్లలో 1978 నుంచి ఇది అంతర్భాగంగా ఉంది. ఈ కారణం చేతనే మహోన్నతమైన వారసత్వం మరియు హోదాను తప్పనిసరిగా ఈ ప్రాంతపు స్ఫూర్తి మరియు లక్షణంతో వేడుక చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించాము.
 
ఈ నూతన టీవీసీని ఈ కారణం చేతనే రాజీపడని (తెలుగు) మహిళల ధోరణికి నివాళిగా ఇది ఉంటుంది. ఈ మహిళలు తమను తాము ఆవిష్కరించుకోవడంతో పాటుగా ఎన్నడూ అత్యుత్తమత విషయంలో రాజీపడవద్దనే ధోరణి ప్రదర్శిస్తుంటారు. తమ గుర్తింపు కోసం అస్సలు రాజీపడవద్దనే బలీయమైన ఆలోచనతో పాటుగా ఈ రాష్ట్ర లక్షణాన్ని సైతం ప్రదర్శించేలా ఈ ప్రాంతపు మహిళల సంకల్పానికి సైతం వందనం ఆర్పించాలనుకున్నాం. టాటా టీకు చెందిన అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తి టాటా టీ జెమినీ. తెలంగాణా మార్కెట్‌తో మా ప్రాంతీయ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో మా నూతన కమ్యూనికేషన్‌ మరియు ప్యాకేజింగ్‌ను తీసుకువచ్చాం’’ అని అన్నారు.
 
ఈ టీవీసీ గురించి శ్రీమతి గరీమా ఖండేల్‌వాల్‌, చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌, ముల్లెన్‌ లింటాస్‌ మాట్లాడుతూ, ‘‘ప్రతి ఒక్క అంశంలోనూ తెలంగాణా మహిళలు బంగారు ప్రమాణాలను కలిగి ఉంటారని ఈ ప్రచారంలో అంతర్భాగంగా వెల్లడించాం. వారు సాధించిన మరియు సాధించాలనుకుంటున్న అంశాల పరంగా మిగిలిన వారికి భిన్నంగా నిలిచేలా చేసేది వారు నిర్ధేశించుకున్న ప్రమాణాలు. అన్ని కష్టాలనూ అధిగమించి తమ కలలను సాధించుకోవడానికి వారు శ్రమిస్తుంటారు.
 
ఈ కమ్యూనికేషన్‌ ద్వారా టాటా టీ జెమినీ ఇప్పుడు అత్యుత్తమ తప్ప మరేదీ వద్దనే వీరి రాజీలేని స్ఫూర్తికి నివాళులర్పిస్తుంది. ప్రాంతీయ గౌరవాన్ని పెంపొందించాలనే బ్రాండ్‌ యొక్క ప్రయత్నాలలో ఇది మరో రూపం, అయితేఈసారి దానిని ఈ రాష్ట్ర మహిళల కోణంలో చూపించే ప్రయత్నం చేశాం. టాటా టీ జెమినీ వారి ప్రాధాన్యతా ఎంపిక అని వెల్లడించడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి మహిళలకు ఒక నాణ్యమైన టీ మాత్రమే సమాన హోదాను పొందగలదు!’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు