సొంతింటి కల సాకారం చేసుకోవాలా? ఇదిగోండి.. గుడ్ న్యూస్

గురువారం, 12 నవంబరు 2020 (19:35 IST)
సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ప్రకటించింది కేంద్రంలోని మోదీ సర్కారు. అంతేకాకుండా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌కు రూ.18,000 కోట్లు కేటాయించింది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. పన్ను మినహాయింపు ప్రయోజనాలు రూ.2 కోట్లలోపు రెసిడెన్షియల్ యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
సాధారణంగా సర్కిల్ రేటుకు అగ్రిమెంట్ వ్యాల్యూకు మధ్య వ్యత్యాసం 10 శాతంగా మాత్రమే ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది. అయితే దీన్ని కేంద్రం ఇప్పు్డు 20 శాతానికి పెంచనుంది. అంతేకాకుండా ఇంటి కొనుగోలుదారులు కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(ఎక్స్) కింద 20 శాతం వరకు రిలీఫ్ పొందొచ్చు. అలాగే నిర్మలమ్మ పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ యోజన పథకానికి రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు