తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే స్మార్ట్ కార్డుల జారీలో జాప్యం ఏర్పడుతోంది. ఫలితంగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 300 స్మార్ట్ కార్డులను ప్రింట్ చేసి.. వాహనదారులకు పంపడం జరుగుతుంది. ఈ కార్డులను స్పీడ్ పోస్టుల ద్వారా పంపిస్తారు.
దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల తర్వాతే.. ఈ కార్డులు వాహన దారుల చేతికి అందుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ నెలల పాటు జరుగుతోంది. వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే స్మార్ట్ కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డులు వాహనదారులు అందుకునేందుకు నెల సమయం పడుతోంది. ఈ రిజిస్ట్రేషన్ అయినా స్మార్ట్ కార్డుల కోసం తాము చెల్లింపులు చేసినా ఎందుకు జాప్యం అవుతుందో అర్థం కావట్లేదని ఓ వాహనదారుడు వాపోయాడు.