పండగపూట పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిజానికి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ, శుక్రవారం ఉన్నట్టుండి ఈ ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారంలో కూడా ఈ ధరల్లో పెరుగుదల కనిపించిన విషయం తెల్సిందే.
కాగా, ఢిల్లీలో 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,220గా ఉంది. ముంబైలో 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,190గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉంది.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.