దేశంలో మరోమారు పెరిగిన పెట్రోల్ ధరలు

గురువారం, 30 సెప్టెంబరు 2021 (09:33 IST)
దేశంలో మరోమారు ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64కు చేరగా డీజిల్ ధర రూ.89.87కు పెరిగింది. 
 
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.107.71కు, లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.52 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.105.74కు చేరగా, డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి రూ.98.06కు పెరిగింది.
 
అలాగే, మెట్రో నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45 బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.18, డీజిల్‌ రూ.95.38 చొప్పున ధరలు ఉన్నాయి. మరోవైపు, పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజలంతా గగ్గోలు పెడుతున్నప్పటికీ కేంద్రం మాత్రం స్పందించడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు