వరుసగా మూడో రోజూ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

శనివారం, 2 అక్టోబరు 2021 (10:50 IST)
దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఫలితంగా ఈ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచాయి. 
 
మూడు వారాల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.25కి చేరింది. ఇక డీజిల్ రేటు ధర రూ.98.72గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.47గా ఉంది. 
 
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.80గా ఉంది. డీజిల్ రేటు 95.02గా ఉంది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర రూ.98.16కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.102.77, డీజిల్ రూ.93.57కు లభిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు