అపెక్స్‌ ఇండియా హెల్త్‌ అండ్‌ సేఫ్టీ సదస్సు: సేఫ్‌ వర్క్‌ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌ కోసం గోల్డ్‌ అవార్డు అందుకున్న వేదాంత వీజీసీబీ

మంగళవారం, 4 మే 2021 (17:45 IST)
వేదాంత యొక్క వీజీసీబీకు గోల్డ్‌ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన అపెక్స్‌ ఇండియా హెల్త్‌ అండ్‌ సేఫ్టీ కాన్ఫరెన్స్‌ 2020 వద్ద అందజేశారు. ఈ అవార్డును వీజీసీబీకి  పోర్ట్‌ సర్వీస్‌ రంగంలో ‘సేఫ్‌వర్క్‌ప్లేస్‌ మేనేజ్‌మెంట్‌’ విభాగంలో అందజేశారు. కార్యక్షేత్రంలో సురక్షిత నిర్వహణ ప్రక్రియలను అమలు చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డును వేదాంత యొక్క వీజీసీబీ కు అందజేశారు. అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ నియమించిన స్వతంత్య్ర నిష్ణాతుల బృందం తమ ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, తనిఖీలు చేసిన తరువాత ఈ అవార్డుకు వీజీసీబీని ఎంపిక చేశారు. కంపెనీ తరపున ఈ అవార్డును అపెక్స్‌ ఇండియా ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు మరియు అతిథుల చేతుల మీదుగా వీజీసీబీ హెడ్‌ హెచ్‌ఎస్‌ఈ శ్రీ ప్రసన్నకుమార్‌ అందుకున్నారు.
 
వీజీసీబీ బృందాన్ని అభినందించిన శ్రీ సౌవిక్‌ మజుందార్‌, సీఈవో – ఐరన్‌ అండ్‌ స్టీల్‌ బిజినెస్‌, వేదాంత లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘వేదాంత వద్ద,  వాటాదారులందరి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతాంశంగా నిలుస్తుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు మా విస్తృత శ్రేణి, అత్యంత ప్రభావితమైన భద్రతా ప్రక్రియలకు నిదర్శనంగా నిలుస్తుంది. సుస్ధిర వ్యాపార పనితీరు చేరుకునేందుకు అత్యంత కీలకంగా సురక్షితమైన పనిప్రాంగణాలు మరియు సంరక్షణా సంస్కృతి నిలుస్తాయని మేము నమ్ముతున్నాం. వేదాంత వద్ద, మా నిరంతర ప్రయత్నాలు ఎల్లప్పుడూ కూడా అత్యుత్తమ శ్రేణి భద్రతా ప్రక్రియలను స్వీకరించడం మరియు వాటాదారులందరికీ సురక్షిత పనిప్రాంగణాలను అందిస్తామనే భరోసా కల్పించడానికి ప్రయత్నించే రీతిలో ఉంటాయి’’ అని అన్నారు.
 
శ్రీ సీ సతీష్‌కుమార్‌, డిప్యూటీ సీఈవొ-వేదాంత వీజీసీబీ మాట్లాడుతూ, ‘‘ప్రతిష్టాత్మక అపెక్స్‌ ఇండియా సేఫ్టీ అవార్డు వద్ద వీజీసీబీలో మా అత్యున్నత శ్రేణి భద్రతా ప్రక్రియలను గుర్తించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా వ్యాపార సిద్ధాంతంలోనే మా వాటాదారులందరి భద్రత తొలి ప్రాధాన్యతగా ఉంది. మా వీజీసీబీ పోర్ట్‌ కార్యకలాపాలలో  అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలను మేము స్వీకరించాము. తద్వారా మా అసోసియేటెడ్‌ స్టేక్‌హోల్డర్లందరికీ ‘జీరో హార్మ్‌ ’లక్ష్యంకు అనుగుణంగా భద్రతకు భరోసా అందిస్తున్నాం’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు