ఉద్యోగుల కోసం 24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ ప్రవేశపెట్టిన వెర్ట్యూసా
సోమవారం, 10 మే 2021 (22:57 IST)
కొవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న ప్రస్తుతం సమయంలో ఉద్యోగులకు భద్రత అందేలా సాయపడడం కోసం వ్యక్తిగతమైన ఫీచర్లతో రూపొందించిన తన 24/7 కొవిడ్- 19 కేర్ పోర్టల్‌ను డిజిటల్ వ్యూహాలు, డిజిటల్ ఇజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ, వెర్ట్యూసా కార్పొరేషన్ ఈ రోజు ప్రవేశపెట్టింది.
వెర్ట్యూసా కొవిడ్-19 చొరవలో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్క టీమ్ సభ్యుడు, వారి కటుంబాల పట్ల దీనికి వ్యక్తిగతమైన దృక్పథం ఉంటుంది, ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా చూసుకుంటుంది. 24/7 ప్రత్యక్ష మద్దతు, సహాయంతో, లాగ్ అయిన అన్ని ప్రశ్నలనూ, వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్ సభ్యుల డేటానూ పోర్టల్, కాల్ సెంటర్ పర్యవేక్షిస్తూ ఉంటాయి.
24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ కార్యక్రమాలకు సుందర్ నారాయణన్, వెర్ట్యూసా చీఫ్ పీపుల్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తారు, ఇతర నాయకులు, వాలంటీర్లతో కలిసి పని చేస్తారు. “వెర్ట్యూసాలో ప్రతి సభ్యుడికీ, వారి కుటుబాంలకూ సంరక్షణ అందేలా ఖచ్చితంగా చూడడం కోసం మరిన్ని ప్రయోజనాలను ప్రవేశపెట్టే ఒక పరిపూర్ణమైన నమూనాను ప్రవేశపెట్టడం అనే మా లక్ష్యం మేరకు డాష్‌బోర్డును ప్రతి రోజూ మేము సమీక్షిస్తాం” అని నారాయణన్ తెలిపారు. “ప్రపంచంలో ఎక్కడైనా ఏ సంక్షోభ పరిస్థితి తలెత్తినా ఆనుసరించి, వినియోగించుకొనేలా తీర్చిదిద్దిన పెంచుకొనే, అనువర్తింపజేసుకొనే, డిజిటలైజ్ అయిన ఒక నమూనాను నిర్మించడం మా ఉద్దేశం” అని అన్నారు.
పోర్టల్‌తో పాటు, విస్తృత శ్రేణిలో కొవిడ్-19 సంరక్షణ, సేవలను అందించడం కోసం ఒక వార్ రూమ్‌ను కూడా వెర్ట్యూసా సృష్టించింది, ఆసుపత్రులు, ఇళ్ళు, క్వారంటైన్ కేంద్రాల్లో కొవిడ్-19 పూర్వ, అనంతర సంరక్షణ కూడా ఉంది. రవాణా, ఔషధాలు, ఆహారం, ఆసుపత్రుల్లో పడకలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ సిలెండర్లు సంపాదించడంలో సాయం, ఇంట్లో సంరక్షణతో సహా అదనపు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఎక్కడి నించి విజ్ఞప్తి వచ్చినా సహాయం అందించే తన ప్రయత్నాల్లో ఈ రోజు వరకూ వెర్ట్యూసా బృందం అత్యంత విజయవంతమయింది.
ఈ ప్రయత్నంలో కీలకమైన భాగం తాత్కాలికమైన కొవిడ్ కేంద్రాలు, చెన్నై, హైదరాబాద్‌లలోని వెర్ట్యూసా ప్రదేశాల్లోని ఐసోలేటెడ్ భాగాల్లో ఉద్యోగులకోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాలకు వెర్ట్యూసా సిబ్బంది, ఆ ప్రాంతాల్లోని ప్రసిద్ధమైన ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు సహకారం అందిస్తున్నారు. దీనితోపాటు, కన్వల్సెంట్ ఫ్లాస్మా వర్ట్యూసన్ దాతల క్రియాశీలమైన ఒక డేటాబేస్‌ను కూడా నిర్వహించడం జరుగుతోంది.
“వెర్ట్యూసాలో, మా విర్ట్యూసా కుటుంబానికి అత్యుత్తమమైన సంరక్షణ అందించడానికి మేం చేస్తున్న కృషి ఇది. తమ ఇళ్ళలోని భద్రత నుంచి అత్యుత్తమ స్థాయి ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడం దీని ఉద్దేశం” అని నారాయణన్ పేర్కొన్నారు. “అదే సమయంలో, ముందుకు వెళ్తున్నప్పుడు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కొత్త పరిష్కారాలను అన్వేషించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.
ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి అందుబాటులో ఉంచడం కోసం ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు వెర్ట్యూసా ఆర్డర్లు పెట్టింది. వైద్యులు, పోషకాహార నిపుణులూ, ఆరోగ్య శ్రేయస్సు నిపుణులతో ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్లను కూడా రోజంతా అందిస్తోంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి తన ఉద్యోగుల సంక్షేమ నిధిని వెర్ట్యూసా వినియోగిస్తోంది, అలాగే టీమ్ సభ్యులలో అవసరం ఉన్నవారెవరికైనా వారి మానసిక, శారీరక శ్రేయస్సు కోసం సాయం అందించడానికి వర్ట్యువల్ కనెక్ట్ ప్రయత్నాలు చేపడుతోంది. పంపిణీ, వినియోగదారుల కేంద్రీయత చెక్కుచెదరకుండా చూసుకుంటూనే అవన్నీ చేపట్టడం జరుగుతోంది.
ఇంతకుముందు, ఆసుపత్రుల భాగస్వామ్యంతో టీమ్ సభ్యులకూ, వారి కుటుంబాలకూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వెర్ట్యూసా నిర్వహించింది. హోమ్ క్వారంటైన్ వైద్య బీమా పథకాన్ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.