కెరీర్-టెక్ ప్లాట్‌ఫామ్ అయిన వర్క్ రూట్ తన ఫ్లాగ్‌షిప్ ఉత్పాదన, భారతదేశంలోని ప్రముఖ AI-ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన రెజ్యూమ్ బిల్డర్‌తో దాదాపు నాలుగు మిలియన్లకు పైగా రెజ్యూమ్‌లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కెరీర్ దశకు పరిశ్రమ & వనరులకు సంబంధించిన అర్ధవంతమైన రెజ్యూమ్‌లతో అన్ని డొమైన్‌లు, ఫీల్డ్ లకు సంబంధించినవి ఇందులో ఉంటాయి. కంపెనీ ఇప్పటివరకు 1.5 మిలియన్ల రెజ్యూమ్‌లను చేరుకుంది. ఐటీ, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఫైనాన్స్ & కమ్యూనికేషన్స్ వంటి కీలకమైన డొమైన్‌లు కవర్ చేయబడ్డాయి.
4 మిలియన్ ప్లస్ రెజ్యూమ్‌ల లక్ష్యాన్ని సాధించడానికి, వర్క్ రూట్, ప్రథమ శ్రేణి మార్కెట్‌లతో పాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. పటిష్ఠ ప్రభావాన్ని సృష్టించే రెజ్యూమ్‌లపై అవగాహన కల్పించ డాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాట్‌ఫామ్ గురించి యువతలో భాగస్వామ్యం, అవగాహన కల్పించడం, వారికి అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, ఈ రోజున మార్కెట్లో కనిపించే అంతరాన్ని తగ్గించడం కూడా కం పెనీ లక్ష్యం. తన B2B, B2C సొల్యూషన్‌ల సూట్ ద్వారా పరిశ్రమ, ఉద్యోగార్ధుల కోసం కెరీర్ డెవలప్‌మెంట్ ఎకో సిస్టమ్‌ను నిర్మించడాన్ని సంస్థ తన లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో AI-పవర్డ్ రెజ్యూమ్ బిల్డర్, జాబ్ సెర్చ్ అండ్ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఉన్నాయి.
ఈ సందర్భంగా వర్క్ రూట్ సీఈఓ, వ్యవస్థాపకుడు మణికాంత్ చల్లా తమ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, "ప్రారంభం నుండి, వర్క్ రూట్ సంవత్సరానికి 110% కంటే ఎక్కువ వృద్ధి చెందింది. సమాన అవకాశాలు, అందుబాటును తీసుకురావడానికి, వర్క్ రూట్ తన పరిష్కారాలను మరింత ప్రాంతీయ, అంతర్జాతీయ భాష లకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా విస్తృత స్థాయిలో వివిధ వర్గాలకు వారి ప్రాధాన్య భాషలో డిజి టల్ రెజ్యూమ్‌ను రూపొందించడానికి మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది అని అన్నారు.