ఉబెర్ ఈట్స్ సేవలు ఇకలేవ్.. జొమోటో చేతిలోకి వెళ్ళిపోయిన..?

మంగళవారం, 21 జనవరి 2020 (12:21 IST)
2017వ సంవత్సరం భారత్‌లో ప్రారంభమైన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ తన సేవలను నిలిపివేసింది. జొమోటో సంస్థ ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఉబెర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. భారత్‌లో ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో అడుగెట్టిన ఉబెర్ ఈట్స్.. జొమాటో, స్విగ్గీలతో పోటీ పడలేకపోయింది. 
 
ఫలితంగా వాణిజ్య పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ అవకాశాలను తగ్గించింది. చివరికి ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేయాలని సంస్థ అధికారులు భావించారు. ఇందులో భాగంగా జొమాటో సంస్థ ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసింది. ఫలితంగా ఉబెర్ ఈట్స్‌లోని 9.99శాతం కస్టమర్లు, ఉద్యోగుల వివరాలను ఉబెర్ ఈట్స్ సంస్థ జొమోటోకు మార్పు చేసింది. దీనిపై ఉబెర్ ఈట్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు