వీడియోలో పోలీసులను దూషించే యువతి పేరు ప్రియాంక మోరే (27) అని తెలిసింది. ఈమె జొమాటో సంస్థలో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది. ఈమె గత ఎనిమిదో తేదీ నేవీ ముంబై వాషీ సెక్టార్-8 ప్రాంతంలో నో-పార్కింగ్‌లో తన టూవీలర్‌ని నిలిపివుంచింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి గస్తీకి వచ్చిన పోలీసులు నో-పార్కింగ్‌లో నిలిపిన ఆమె బండిపై ఫైన్ కట్టమన్నారు.