అందరు నడిచే దారిలో నడిస్తే కొత్తేముంటుంది. అవే ఉద్యోగాలు.... అవే డ్యూటీలు.. వీకెండ్లు... పబ్బులు... క్లబ్బులు.. ఇది కాస్త కుర్రకారుకు బోరు కొట్టినట్లుంది. అందుకే ఝయ్...... అంటూ ఆకాశాయనంలో పరుగులు పెట్టడానికి తెగబడుతున్నారు. ఈ మధ్య కాలంలో యువత పరుగులు
ఇటీవల కాలంలో భారతీయ విమానయాన రంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానాలు గగనతలంలో తళతళా మెరుస్తున్నాయి. విదేశీ సంస్థలు కూడా ఇందులో యువత కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తోంది. సాధారణంగానే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. చాలా చోట్ల విమాన సర్వీసుల సంఖ్య 100 శాతం పెరిగింది. అవకాశాలు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే విద్యాసంస్థలు కూడా పెరిగాయి.
క్రేజీ ఉద్యోగాలు ఇందులో ప్రధానంగా క్యాబిన్ బృందం, ఆ తరువాత విమాన బృందంలోని ఉద్యోగాలు చాలా క్రేజీ ఉన్నవిగా తెలుస్తోంది. క్యాబిన్ బృందంలో కెప్టెన్, పైలట్, కోపైలట్ చాలా క్రేజీ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వచ్చే జీతాలు కూడా చాలా భారీగానే ఉంటాయి. కొత్తగా చేరిన వారు కూడా లకారాలకు దగ్గరగా జీతాలు తీస్తున్నారు. కాస్త సీనియారిటీ ఉంటే జీతం ఒకటిన్నర లకారం దాటుతుంది. టైమింగ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. వారానికి ఇన్ని గంటలు పని చేస్తే చాలు. ఆ వారానికి డ్యూటీ ముగుస్తుంది.
ఇందులో మరో క్రేజీ ఉద్యోగం ఎయిర్ హోస్టెస్. ఇది ప్రపంచంలోనే చాలా క్రేజీ ఉద్యోగంగా చెప్పవచ్చు. జీతాలు పైలట్ల కంటే దిగువ స్థాయిలో ఉన్నా వీరికి ఉండే ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరే కాకుండా స్టూవార్డ్, డాక్టర్... ఇలా ఎన్నో పోస్టులు కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. విమానయాన సంస్థలు పెరిగిపోతున్న రోజుల్లో ఈ ఉద్యోగాలకు ఆకాశం నుంచి యువత ఎదుటకు దిగి వచ్చాయి. ఇక విమానశ్రయాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇలా చాలా రకాల ఉద్యోగాలే ఉన్నాయి.
ఎందుకంత క్రేజీ సాధారణంగా పైలట్ అనేది వైట్ కాలర్ ఉద్యోగం. ఎక్కితే విమానం... దిగితే విమానం.... వారంలో కొన్ని గంటలు డ్యూటీ చేస్తే మిగిలిన సమయం విశ్రాంతి. మిగిలిన రంగాలలో ఉన్నవారు ఎంతటి పెద్ద ఉద్యోగం చేసిన దేశదేశాలు లేదా దేశీయంగానైతే ప్రముఖ నగరాలు తిరగడం అంత సులువైన పనేమి కాదు. విమానయానం ఇది చాలా సులువుగా ఉంటుంది. కాస్త వృత్తిలో ప్రావీణ్యం చూపితే ప్రముఖ దేశాలకు విమానాన్ని నడుపుకుని వెళ్లవచ్చు. ఇది సాధారణ ఇతర రంగాలలో పని చేసే వారికి ఎలా సాధ్యం అందుకే అంతటి క్రేజీ. ఎంత క్రేజీనో, విధులు కూడా అంతే కష్టం.
ఎయిర్ హోస్టెస్‌ల విషయానికొస్తే ఇది మరో కోణం ఆధునికతకు చాలా దగ్గరగా ఉండే ఉద్యోగమే ఇది. విమాన ప్రయాణానికి వచ్చేవారి సాదరంగా ఆహ్వానించడంతో వీరి విధి ఆరంభమవుతుంది. విమానం అనగానే అందులో ప్రయాణించే వారందరూ ప్రముఖులే. పారిశ్రామికవేత్తలు, అగ్రనాయకులు, సినీమా స్టార్లు. వీరితో పరిచయాలు ఏర్పడే అవకాశాలు. ఉన్నత పరిచయాలు పనికిరావని ఆధునిక యుగంలో పోటీ పడుతున్న ఎవ్వరూ కాదనరు. అందుకే ఆ పోస్టుకు అంత క్రేజీ.
ఈ ఉద్యోగాలున్నాయి.
ఎయిర్ పోర్టు, గ్రౌండ్ స్టాఫ్, ఇన్‌స్ట్రక్టర్, విమాన బృందం, కాబిన్ బృందం,
నిర్వహణ, ఇంజనీరింగ్ విభాగం, ఆపరేషన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సేల్స్, మార్కెటింగ్
పుట్టుకొస్తున్న కాలేజలు ఇలాంటి ఉద్యోగాల కోసం ఏమేమి కోర్సుఇందులో చాలా క్రేజీ ఉన్న కోర్సు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇందులో డిగ్రీ, డిప్లొమా కోర్సు ఉన్నాయి. ఇందులోనే వివిధ గ్రూపుల కింద దాదాపు అన్ని టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు వస్తాయి.
ఇందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో మంచి మార్కులు సాధించిన వారికి ప్రతిష్టాత్మకమైన ఏరోనాటికల్ సంస్థల్లో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు. ఇక ఎయిర్ హోస్టెస్‌లకు శిక్షణ ఇస్తున్న సంస్థలు ప్రముఖ నగరాలన్నింటిలో దర్శనమిస్తున్నాయి. ఇక ఆలస్యమెందుకు కాస్త దీనిపై దృష్టి పెట్టి ఇంటర్నట్‌లో ఈ ఉద్యోగాల్లో కీవర్డ్ కంపోజ్ చేసినా జాబితా చాలా పెద్దదే వస్తుంది.