ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ఏ గ్రేడ్‌ను ఇచ్చినట్టు నాక్ తెలిపింది. బెంగళూరులో సమావేశమైన నాక్ ప్రతినిధుల బృందం ఆంధ్ర వర్శిటీకి ఈ గ్రేడ్‌ను కేటాయించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి సత్యనారాయణ తెలిపారు.

విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వసతులు, బోధన, నిర్వహణ, ప్లేస్‌మెంట్స్ వంటి అంశాల ఆధారంగా నాక్ ప్రతినిధులు తమ విశ్వవిద్యాలయానికి 3.65సీజీపీఏ పాయింట్లు ఇచ్చి, గ్రేడ్ ఏ కేటాయించిందని వెల్లడించారు.

ఈ కేటాయింపు ద్వారా విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అదనపు నిధులు అందగలవన్నారు. ఏప్రిల్ నెలలో నాక్ ప్రతినిధుల బృందం విశ్వవిద్యాలయ సౌకర్యాలను, కోర్సులను గురించి వివరంగా తెలుసుకుందన్నారు.

వెబ్దునియా పై చదవండి