కొనసాగుతున్న హోమియో కోర్సుల కౌన్సెలింగ్

మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:34 IST)
FileFILE
రాష్ట్రంలోని హోమియో, నేచురోపతి వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకోసం కౌన్సెలింగ్ మంగళవారం కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి వరకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా 176 సీట్లు భర్తీ చేశారు.

ఇప్పటివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలోని ఓపెన్ కేటగరీ సీట్లన్నీ భర్తీ కాగా, ఇతర కేటగరీ సీట్లకోసం కౌన్సెలింగ్ కొనసాగుతోందని విశ్వవిద్యాలయ క్యాంప్ వర్గాలు తెలిపాయి.

ఐదు ఆయుర్వేద కళాశాలల్లో ఉన్న 182 బీయుఎంఎస్ సీట్లకోసం మంగళవారం కౌన్సెలింగ్ జరుగుతోంది. మరోవైపు నెల్లూరులో ప్రారంభించిన నేచురోపతి యోగా ప్రైవేట్ వైద్య కళాశాల సీట్లను కూడా ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి