దసరా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణ

గురువారం, 11 సెప్టెంబరు 2008 (16:32 IST)
FileFILE
దసరా తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో సక్సెస్ పథకం కింద ఎంపికైన 135 ఉన్నత పాఠశాలల్లో ఈ కంప్యూటర్ శిక్షణ ప్రవేశపెట్టేందుకు అన్ని చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.

ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌‌ను ప్రవేశపెట్టగా, తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద కంప్యూటర్ శిక్షణకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డీఈవోను ఆదేశించడంతో ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి.

విద్యుత్ సదుపాయం, తగిన వసతులు లేని చోట వెంటనే వాటిని సమకూర్చాలని ప్రధానోపాధ్యాలను డీఈవో ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో కంప్యూటర్ బోధన పూర్తి బాధ్యతలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానికి గవర్నెన్స్‌కు అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి