వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ 18న ప్రారంభం

మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:33 IST)
FileFILE
అగ్రికల్చర్ వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం కౌన్సెలింగ్ గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభం కానుందని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తెలిపింది. సైఫాబాద్‌లోని హోం సైన్స్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పోచయ్య వెల్లడించారు.

ఓపెన్ క్యాటగరీ అభ్యర్థులకు 18న , బీసీ విద్యార్థులకు 20న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్టీ రంగా విశ్వవిద్యాలయంతో పాటు శ్రీవెంకటేశ్వర, ఏపీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సైతం సీట్లకోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

కాగా తమ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్), బీటెక్ (ఫుడ్ సైన్స్), ఎంటెక్ (అగ్రి ఇంజినీరింగ్) కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారు సెప్టెంబర్ 24న తరగతులకు హాజరు కావాలని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి