7న డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశ పరీక్ష

గురువారం, 4 ఏప్రియల్ 2013 (13:42 IST)
File
FILE
డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అనివార్య కారణాల రీత్యా ఉన్నత విద్యను అభ్యశించలేని వారు ఈ ఓపెన్ వర్శిటీలో విద్యాభ్యాన్ని పూర్తి చేయవచ్చు.

ఇందులోభాగంగా.. ఓపెన్ యూనివర్శిటీ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 7వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 215 అధ్యయన కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. వివిధ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్ధులు www.braou.ac.in లేదా www.aponline.gov.in అనే వెబ్ సైట్ల నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి