ఆయన బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు.
ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తే విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కాగా, మాతృభాషకు ఏపీ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇపుడు సీబీఎస్ఈ అంశం తెరపైకి తీసుకునిరావడం గమనార్హం.