రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో 16,207 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా.. 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన నేపథ్యంలో వాటిలో మిగిలిన ఉద్యోగాలతోపాటు.. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 11న ప్రారంభమైంది. పోస్టుల వారీగా విద్యార్హతలను బట్టి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్షల ద్వారానే ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి జనవరి 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది.