నేడే CUET UG 2022 ఫలితాలు.. అప్లికేషన్ కరెక్షన్ కు నేటి వరకే టైమ్

గురువారం, 15 సెప్టెంబరు 2022 (14:07 IST)
సీయూఈటీ ఫలితాలు నేడు (సెప్టెంబర్‌ 15) విడుదలకానున్నాయి. ఇప్పటికే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆన్సర్‌ కీ విడుదలైంది. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CUET) ఫలితాలు సెప్టెంబర్‌ 15న విడుదల చేయనున్నట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు. 
 
దేశంలో CUET జరగడం ఇదే తొలిసారి. కాగా.. జులై 14 నుంచి ఆగస్టు 30 వరకు దేశంలో 510 కి పైగా నగరాల్లో CUET పరీక్ష నిర్వహించారు. 
 
అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల అప్లికేషన్ కరెక్షన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓపెన్ చేసింది. సెప్టెంబరు 15 వరకు తెరచి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు దొర్లినవారు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు.  అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు