నేడు ఐసిఎస్‌ఇ, ఐఎస్‌సి 10, 12వ తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (సీఐఎస్‌ఈ) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని తెలిపింది.
ఫలితాలు, వారికి వచ్చిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు ఒకటో తేదీ వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు ఐసిఎస్‌ఇ కార్యదర్శి జెర్నీ అరాథూన్ వెల్లడించారు.
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో ఐసిఎస్‌ఇ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వీటిని ప్రకటించనున్నారు. ఇక సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించేందుకు సీబీఎస్ఈ బోర్డు కసరత్తు చేస్తోంది.