ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, హైదరాబాద్ 2025-27 బ్యాచ్ కోసం తమ ప్రధాన మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిన అభ్యుదయ్ 2025ను విజయవంతంగా ముగించింది. జూన్ 18, 2025న ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, పిజిడిఎం విద్యార్థుల విద్యా ప్రయాణంలో కీలకమైన ఘట్టంగా నిలిచింది. ఐఎంటి హైదరాబాద్ యొక్క విలువలను వారికి పరిచయం చేసింది, రాబోయే సవాళ్లకు వారిని సిద్ధం చేసింది. విద్యార్థులకు వారి విద్యా, వృత్తిపరమైన వృద్ధికి అవసరమైన ఆచరణాత్మక సాధనాలను అందించింది.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని టిసిఎస్ హెడ్ శ్రీ చల్లా నాగ్; ఎలికో హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వనితా దాట్ల; స్మార్ట్ ఫార్మా360 సీఈఓ- సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి సాకేత పి; ప్రముఖ న్యాయ నిపుణురాలు న్యాయవాది మోబాష్షీర్ సర్వర్; కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టీఫెన్ మెచౌలన్; కాలిబర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎ అపర్ణ సురభి; క్రౌడ్‌స్ట్రైక్‌లో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్ శ్రీ రాజేష్ మీనన్; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సీనియర్ ఫెలో శ్రీ పార్థా ప్రతిమ్ దాస్‌గుప్తా; ఐఐఎం కాశీపూర్ మాజీ డైరెక్టర్ మరియు ఐఎంఎస్ యూనిసన్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గౌతమ్ సిన్హా పాల్గొన్నారు, విలువైన పరిజ్ఙానం పంచుకున్నారు.
అభ్యుదయం 2025 సందర్భంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం ఐఎంటి హైదరాబాద్ విద్యార్థులకు హైదరాబాద్‌లోని విభిన్న స్వచ్ఛంద సంస్థలను కలిసే అవకాశం అందించింది. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, నిర్మాణ్ మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్‌లను వారు సందర్శించారు.
ఐఎంటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ బహరుల్ ఇస్లాం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "క్రమశిక్షణ ప్రోత్సహించబడదు, కానీ ఆశించబడుతుంది, ఎందుకంటే ఇది వృత్తిపరమైన ప్రవర్తన, విద్యా నైపుణ్యానికి పునాది వేస్తుంది" అని నొక్కి చెప్పారు. "నేర్చుకోవడానికి ఆసక్తి" అనే వైఖరిని పెంపొందించుకోవాలని, ఉత్సుకతతో ఉండాలని, తమ ప్రయాణంలో నిరంతరం అభివృద్ధి చెందాలని ఆయన విద్యార్థులను కోరారు. అభ్యాసం తరగతి గదులకే పరిమితం కాదన్న ఆయన ఆలోచనలు, అలవాట్లు, క్రమశిక్షణ ఇక్కడ మీ ప్రయాణాన్ని నిర్వచిస్తుందన్నారు.