మొత్తం 14,033 పోస్టులల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు వుండనున్నాయి. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. చివరి తేదీ జనవరి 31. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 33 లోపు వుండాలని తెలియజేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు ఇజనీరింగ్ లేదా డిప్లమా డిగ్రీ చేసి ఉండాలి. ఇకపోతే ఈ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా రెండు విడతలుగా నిర్వహించనున్నారు.