NEET 2020: దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 1 రాత్రి 11.50 గంటలు

గురువారం, 26 డిశెంబరు 2019 (11:35 IST)
నీట్ 2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నీట్ 2020 నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2019 డిసెంబర్ 2న ప్రారంభమైంది. 

దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 1 రాత్రి 11.50 గంటలు అని ఎన్టీఏ ప్రకటించింది. అలాగే దరఖాస్తు ఫామ్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికి 2020 జనవరి 15 నుంచి 2020 జనవరి 31 వరకు అవకాశం ఉంటుంది. నీట్ 2020 అడ్మిట్ కార్డుల్ని 2020 మార్చి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 మే 3న పరీక్ష జరుగుతుంది. 2020 జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి.
 
ఇకపోతే.. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్‌ కోసం ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ 2020 మాత్రమే జరగనుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

ఈ ఏడాది నుంచి ఎయిమ్స్, జిమ్‌మర్, ప్రైవేట్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు, ఏఎఫ్‌ఎమ్‌సీ, ఈఎస్ఐసీ లాంటి విద్యాసంస్థల్లో అన్ని మెడికల్, డెంటల్ సీట్లు నీట్ 2020 ద్వారానే భర్తీ కానున్నాయి. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునేవారు ‌కూడా నీట్ 2020 ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు