నీట్ పీజీ 2023: సున్నా మార్కులకు తగ్గిన కటాఫ్

బుధవారం, 20 సెప్టెంబరు 2023 (22:11 IST)
వైద్య కోర్సులకు అర్హత పరీక్షగా నీట్‌ను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నీట్ పరీక్ష రాసి ప్రభుత్వ వైద్య కళాశాలలలో చదువుతారు. 
 
ఇకపై నీట్ సున్నా మార్కులు తీసినా.. వైద్య కోర్సులు చదవవచ్చని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. "నీట్ పరీక్షలో జీరో మార్కులు తీసుకున్నప్పటికీ, పీజీ వైద్య విద్యలో చేరవచ్చు" అని ప్రకటించడం జరిగింది. 
 
దీంతో నీట్ పీజీ కోర్సులకు అర్హత శాతం తగ్గింది. ఇప్పటికే నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి అప్లికేషన్ల సవరణ కోసం అనుమతి ఇవ్వబడుతుంది. ఇంకా, పీజీ కౌన్సిలింగ్‌కు సంబంధించిన కొత్త టైం టేబుల్ త్వరలో వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు