ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు. నీఫా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు.
మరోవైపు, నిఫా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.