2021 విద్యాసంవత్సరం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు)

బుధవారం, 7 జులై 2021 (22:44 IST)
ఉన్నత విద్యలో ఆవిష్కరణను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఆరంభమైన లాభాపేక్ష లేని నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) 2021 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
 
ఈ దరఖాస్తులను ఎన్‌యులో నూతనంగా ప్రారంభించిన బీటెక్‌ కోర్సులైన కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌; డాటా సైన్స్‌; సైబర్‌ సెక్యూరిటీ మరియు బిజినెస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌లో బ్యాచులర్స్‌ డిగ్రీ కోసం ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లను మహమ్మారి అనంతర ప్రపంచంలో విద్యార్ధులు విజయవంతమైన కెరీర్‌లను పొందేందుకు తీర్చిదిద్దారు.
 
ఎన్‌యు ఇప్పుడు వినూత్నమైన ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ఇంటరాక్షన్‌ ప్రక్రియ (ఏఐపీ)ను ప్రారంభించింది. దీని ద్వారా యూనివర్శిటీలో అడ్మిషన్‌ కోరుతున్న విద్యార్థులను పరీక్షించడం చేస్తారు. ఈ ఏఐపీ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వంతో పాటుగా విద్యా రికార్డులను సైతం పరిశీలిస్తారు. ఏఐపీలో మూడు భాగాలుంటాయి. అవి ప్రశ్నావళి, 12వ తరగతి బోధనాంశాలపై పరీక్ష, వ్యక్తిగత కౌన్సిలింగ్‌ ఇంటరాక్షన్‌ ఉంటాయి.
 
నిట్‌ యూనివర్శిటీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ పరిమల్‌ మండ్కే మాట్లాడుతూ, ‘‘మహమ్మారి, విద్యా భవిష్యత్‌ను సమూలంగా మార్చివేసింది. ఇది కష్టకాలమే కావొచ్చు కానీ విద్యా నమూనాలను పునః సమీక్షించుకునే అవకాశమూ అందించింది. ఎన్‌యుకు మూలస్థంభంగా సాంకేతికత నిలుస్తుంది. ఈ కారణం చేతనే మేము అత్యంత వేగంగా డిజిటల్‌ నమూనాకు మారడంతో పాటుగా విద్యా కొనసాగింపుకు తోడ్పడుతున్నాం..’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు