ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులకు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

గురువారం, 5 అక్టోబరు 2023 (20:38 IST)
విప్రో కేర్స్‌ సహకారంతో సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఏడవ ఎడిషన్‌ను ప్రారంభించామని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ప్రకటించింది. ఇది 12వ తరగతి, తత్సమాన విద్య అనంతరం ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరుకునే వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలోని విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
తాజా అధ్యయన నివేదికల మేరకు, దేశంలో (18-21 సంవత్సరాలకు) ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినుల స్థూల నమోదు నిష్పత్తి (GER) 27.3%గా ఉంది. ఇది సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వంటి పథకాలను జారీ చేయవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన సముదాయాలు, అల్పసంఖ్యాత వర్గాలకు చెందిన విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించే నిష్పత్తి కేవలం 8% ఉండడం ఆందోళన కలిగించే అంశం. పలు సంవత్సరాలుగా ఆర్థిక పరిమితులతో వారు ఉన్నత విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారు. ఆర్థిక సమస్యలతో పాటు, చిన్న వయసులోనే వివాహాలు, జీవనోపాధి కోసం కార్మికులుగా మారడం, విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచి పెట్టడంతో ఈ వర్గాలకు చెందిన యువతులలో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
 
వ్యక్తులు లేదా కుటుంబాలకు విద్యాభ్యాసం చేసేందుకు సహకరించడం అనేది మూహిక బాధ్యతగా గుర్తిస్తూ, ఉన్నత విద్యాభ్యాసంతో మరింత న్యాయమైన, సమానమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను 2016-17లో ప్రారంభించారు. ఇది గ్రేడ్ 12 పూర్తి చేసిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థినులకు ట్యూషన్, వసతి, ఇతర సంబంధిత ఖర్చుల కోసం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు, సంతూర్ ఉమెన్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 6000+ మందికి స్కాలర్‌షిప్‌లను అందించింది. ఈ ఏడాది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో 1900 స్కాలర్‌షిప్‌లను సంస్థ అందించనుంది.
 
‘‘సామాజిక మార్పుకు విద్య కీలకమైన కారకం అని మేము విశ్వసిస్తున్నాము. మెరుగైన ఉన్నత విద్యాభ్యాసంతో మహిళలకు సాధికారత కల్పిస్తూ, వారికి న్యాయమైన, సమానమైన, మానవీయ సమాజ నిర్మాణానికి విద్య దోహదపడుతుంది. సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ విభిన్న సముదాయాలు, ప్రాంతాలలో ప్రాథమిక మార్పును తీసుకువచ్చేలా రూపొందించగా, ఇది ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు మద్దతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇదే ప్రధాన అంశంగా జారీ చేస్తున్న ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం వ్యక్తిగత, కుటుంబం మరియు సమాజ స్థాయిలలో మార్పును తీసుకువచ్చేందుకు కారణమైన విద్యతో, అట్టడుగు స్థాయిలలో సామాజిక మార్పును పెంపొందించాలన్న మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అని విప్రో లిమిటెడ్ గ్లోబల్ హెడ్ - సస్టైనబిలిటీ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్ పి.ఎస్. నారాయణ్ వ్యాఖ్యానించారు.
 
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రి మాట్లాడుతూ, ‘‘చాలా మంది యువతులు, ముఖ్యంగా అట్టడుగు మరియు వెనుకబడిన సమాజాలలో సామాజిక, సాంస్కృతిక కారణాలతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక వనరుల కొరత, అధిక పేదరికం, బాల్య వివాహాలతో ఉన్నత విద్యను అభ్యసించాలనే వారి ఆకాంక్షలను ఛిన్నాభిన్నం చేసి, వారిని మరింత నిర్వీర్యం చేసి, సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తుంది. ఈ యువతులకు ఆర్థిక అడ్డంకులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు సంతూర్ స్కాలర్‌షిప్ కార్యక్రమం ఒక వేదిక. మొదటి తరం అభ్యాసకులలో చాలా మందికి, ఈ చొరవ వ్యక్తిగత ఆకాంక్షలను మాత్రమే కాకుండా వారి కుటుంబాలు, సమాజంలో భారీ స్థాయిలో సానుకూల మార్పులకు తీసుకురావడాన్ని మేము పలు ఏళ్లుగా గమనిస్తూ వచ్చాము. వారి విద్య కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా, మేము వారికి వ్యక్తిగత వృద్ధికి అవకాశాలు కల్పిస్తూ, ఆర్థిక సమానత్వానికి, విస్తృత సామాజిక లక్ష్యాలకు మద్దతు ఇస్తున్నాము’’ అని వివరించారు.
 
విప్రో కన్స్యూమర్ కేర్ & లైటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ - మార్కెటింగ్ ఎస్.ప్రసన్న రాయ్ మాట్లాడుతూ, ‘‘ఈ ఏడాది మొత్తం 1900 మంది స్కాలర్‌లను చేరుకునేలా మా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు తలా 500 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాము. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో మా స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాము. ఈ ఏడాది అక్కడ 400 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాము. గత ఏడేళ్లుగా, మా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థినులపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించింది. వెనుకబడిన నేపథ్యాల నుంచి 6000 మందికి పైగా అర్హులైన యువతులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించింది. విద్య అనేది వ్యక్తిగత కుటుంబాలు మాత్రమే భరించే భారం కాకూడదు. అది సమిష్టి బాధ్యత అనే మా అచంచలమైన నమ్మకాన్ని ఈ విజయం బలపరుస్తుంది. ఇది మా సంస్థాగత నిబద్ధతకు నిదర్శనం. అందుబాటులో ఉన్న విద్యను పెంపొందించడం, మరింత సమానమైన మరియు జ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టించడం’’ మా లక్ష్యంగా ఉంది అని వివరించారు.
 
‘‘భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావాలనేది నా ఆకాంక్ష. నా చదువుకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం నాకు పెద్ద సవాలుగా భావించాను. సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ సహకారంతో నా ఆర్థిక భారం తగ్గడమే కాకుండా నా జీవితాన్ని మార్చే అనుభవాన్ని అందించింది. ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు, నాకు సాధికారత కల్పించేందుకు నా కుటుంబం నాకు మద్దతు ఇస్తోంది. ఈ కార్యక్రమం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు; ఇది నాలాంటి మహిళలకు నమ్మకం మరియు మద్దతుకు చిహ్నం’’ అని 2వ ఏడాది బీకాం విద్యార్థిని మరియు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లబ్ధిదారురాలు ప్రసన్న కుమారి పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు