టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్- మార్చి 6న విడుదల.. మేలో పరీక్ష

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (11:38 IST)
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

టీఎస్​ఐసెట్-2020 కమిటీ సమావేశం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సందర్భంగా నోటిఫికేషన్, పరీక్ష ఫీజు తదితర అంశాలపై చర్చించారు. ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి సెట్ షెడ్యూల్​ను ప్రతిపాదించిగా కమిటీ ఆమోదం తెలిపింది. తొలిసారి ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్వాంగులకూ ఫీజులో రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
 
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ స్టూడెంట్స్ కు రూ.450, ఇతర విద్యార్థులకు రూ.650 ఎగ్జామ్​ఫీజు ఉంటుంది. టీఎస్ ఆన్​లైన్, ఈసేవా సెంటర్స్ తో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 14 రీజియన్ సెంటర్లలో ఐసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. వీటిలో ఏపీకి చెందిన కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. మే 20,21 తేదీల్లో మూడు సెషన్స్ లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. జూన్ 12న ఫలితాలను విడుదల చేస్తారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు