ఆర్పీఎఫ్‌లో పోలీసు ఉద్యోగాలు

సోమవారం, 15 సెప్టెంబరు 2008 (16:35 IST)
PTI PhotoPTI
పశ్చిమ మధ్య రైల్వేలో రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్)‌లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 236 పోస్టులు ఉండగా, అందులో 12 పోస్టులను మహిళలకు కేటాయించారు.

ఖాళీల సంఖ్య మారే అవకాశముండగా, ప్రభుత్వ కోటా విధానం మేరకు ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి ఉత్తీర్ణులై జులై 1 తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నియమావళి ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపికైన వారికి రూ. 3050-4590లతో పే స్కేలు ఉంటుంది. అభ్యర్థులు 165మీఎత్తు, బరువు 50 కిలోలు, సాధారణ స్థితిలో ఛాతీ కొలత 80సెంమీల మేర ఉండాలి. మహిళా అభ్యర్థులకైతే 157సెంమీల ఎత్తు, 46కేజీల బరువు ఉండాలి.

దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలను పరిశీలించి, అర్హతలను ధృవపరచనున్నారు. 1500మీటర్ల దూరం పరుగు, 200మీల దూరం పరుగు, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో వంటివాటిని పురుషులకు, 400మీటర్ల రేస్, లాంగ్ జంప్ పరీక్షలను మహిళలకోసం నిర్వహిస్తారు.

ఇతర వివరాలకు సెప్టెంబర్ 13 తేదీతో కూడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రిక చూడగలరు. దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 15 చివరి తేదీ కాగలదు. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రికలో కనబరిచిన చిరునామాకు ఆ లోపు పూర్తి చేసిన దరఖాస్తులను పంపాలి.

వెబ్దునియా పై చదవండి