ఇంటర్ చేసిన వారికి డిఫెన్స్‌లో ఇంజనీరింగ్ కోర్సు

సోమవారం, 15 సెప్టెంబరు 2008 (16:30 IST)
FileFILE
ఇంటర్ పూర్తి చేసిన వారికి డిఫెన్స్ రంగంలో ఇంజినీరింగ్ కోర్సుతో ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏటా ఇంటర్ ముగించిన వారికి కోర్సును అందించి, అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా అందించనున్నారు.

టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ పేరుతో ఈ ఉద్యోగాలకోసం 85మందిని ఎంపిక చేయనున్నారు. జనవరి1, 1990- జనవరి 1, 1993 మధ్య కాలంలో పుట్టిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్.ఎస్.సి మార్కుల జాబితా ఆధారంగా వయసును నిర్ణయిస్తారు.

గణితం, భౌతికం, రసాయన పాఠాల్లో సగటున 70శాతం మార్కులు కలిగి ఉండాలి. అలాగే కనీసం 167.5సెంమీల ఎత్తు, ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. భోపాల్, అహ్మదాబాద్, బెంగళూరలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే పరీక్షల ఆధారంగా ఈ కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మోడెల్ దరఖాస్తు, ఇతర వివరాలకు సెప్టెంబర్ 13తేదీతో కూడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పత్రిక చూడటం మంచిది. పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్ 31లోపు సంబందిత చిరునామాకు అందేలా పంపాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి