సీఎస్ఐఆర్‌లో ఉద్యోగ అవకాశాలు

కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)లో క్విక్ హైర్ సైంటిస్ట్ పథకం కింద ఇంజనీరింగ్ విభాగంలోని పీజీ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మెకాట్రానిక్స్, మెటీరియల్స్ రిసోర్స్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ పెట్రోలియం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎన్విరాన్‌మెంటల్ సిస్టమ్స్, మోడలింగ్ అండ్ ఆఫ్టిమైజేషన్, అడ్వాన్స్‌డ్ ఇన్‌‍స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ సెమి కండక్టర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

డిగ్రీ కోర్సులోని ఇంజనీరింగ్‌లో విభాగంలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌లో వచ్చిన మార్కులను ప్రమాణికంగా తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు సైంటిస్ట్ ట్రైనీ హోదాను కల్పిస్తారు. అలాగే నెలకు రూ.24,000 వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

శిక్షణ పూర్తయిన వెంటనే సైంటిస్ట్ హోదానిస్తారు. సైంటిస్ట్‌గా నియమితులైన వెంటనే వేతన స్కేలు రూ.15,600 నుంచి రూ.39,100గా అందజేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా పంపాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి