చంద్రయాన్ సెన్సార్లలో సాంకేతిక లోపాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన చంద్రయాన్‌ ప్రయోగంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. చంద్రయాన్‌లో అమర్చిన సెన్సార్లలో సాంకేతిక లోపాలను కనుగొన్నట్టు ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు. కాగా, చంద్రయాన్ ప్రయోగించిన ఏడు నెలల తర్వాత ఈ లోపాలను గుర్తించినట్టు ఆయన చెప్పారు.

అయితే, వీటివల్ల పెద్దగా నష్టం లేదన్నారు. అయితే, చంద్రయాన్ జీవితకాలం మాత్రం రెండేళ్లు తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో వర్గాలు అంటున్నాయి. చంద్రయాన్ గమనాన్ని నిర్ధేశించే నిమిత్తం ఈ సెన్సార్లను అమర్చారు. ఇదిలావుండగా ఉండగా, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది.

వెబ్దునియా పై చదవండి