వెన్నెల రాజు త్రివర్ణ పతాక ధారణం

WD
ఆహ్లాదాన్ని పంచే చందమామపై మరికొద్ది గంటల్లో భారతీయ త్రివర్ణ పతాకం చేరనుంది. చంద్రుని తుది కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-1 లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ శుక్రవారం రాత్రి సరిగ్గా 8 గంటల 4 నిమిషాలకు ఉపగ్రహం నుంచి విడివడి రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో చంద్రుని ఢీకొడుతుంది. ఈ పరికరంపై భారతీయ మువ్వెన్నల జెండాను చిత్రీకరించారు. పరికరం చంద్రుని ఢీకొట్టడం ద్వారా మన దేశం చంద్రునిపై అడుగుపెట్టినట్లవుతుందని షార్ ప్రతినిధి సతీష్ పేర్కొన్నారు.

చంద్ర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-1 మరో రెండేళ్లపాటు ఈ కక్ష్యలోనే ఉంటుంది. కాగా 2012 నాటికి చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. దీని సహాయంతో చంద్ర మండలంలోని నమూనాలను సేకరించి వాటిని అధ్యయనం చేస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి