చెన్నైలోని శ్రీవారి ఆలయంలో (నగ్న) అఘోరాలు - భయంతో భక్తుల పరుగులు

ఆదివారం, 16 జులై 2017 (21:40 IST)
నియమాలు నిబంధనలు డోంట్ కేర్.. తాము అనుకుంటే ఏదైనా జరగాల్సిందే. ఇది రాజకీయ నేతల తీరు. ఇది రాజకీయాలే తప్ప కొంతమంది ఇదే తమ పైచేయిగా వ్యవహరిస్తుంటారు. కొంతమంది నేతలు భక్తులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నైలోని శ్రీవారి ఆలయంలోకి అఘోరాలను అనుమతించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
 
చెన్నైలోని శ్రీవారి ఆలయంలోకి అఘోరాలను ఆహ్వానించడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పాలకమండలి నిర్వాకం వల్ల ఆలయ ప్రతిష్ట మంటకలిసిందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులు రవిబాబు, శంకర్‌లు అఘోరాలను, నాగసాధువులను ఆహ్వానించి స్వామి వారి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
ఆగమశాస్త్రాల ప్రకారం అఘోరాలను అనుమతించకూడదు. అయితే ఈ విషయాన్ని పాలకమండలి సభ్యులకు కొంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. దర్శనం తరువాత అఘోరాలకు సన్మానం కూడా చేసేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అంతా అయిపోయిన తరువాత పాలకమండలి సభ్యులు ఆలయాన్ని శుద్థి చేయించారు.

వెబ్దునియా పై చదవండి