చిన్నారుల సంరక్షణ కోసం.. డే కేర్‌లపై ఆధారపడుతున్నారా?

ఆదివారం, 25 నవంబరు 2018 (15:38 IST)
ఆధునికత పేరిట భార్యాభర్తలు గంటల పాటు ఆఫీసుల్లో గడిపేస్తున్నారు. పిల్లల సంరక్షణ కోసం డే కేర్‌లపై ఆధారపడుతున్నారు. అలా డే కేర్లకు పిల్లలను పరిమితం చేస్తున్న తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తక్కువ నూనెతో వాడిన పదార్థాలను వాడాలి. కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, పెరుగు వంటి పదార్థాలు ఆహారంలో చేర్చాలి. 
 
కొవ్వు అధికంగా వుండే పిజ్జా, ఇన్‌స్టంట్ నూడుల్స్‌, బర్గర్లను పిల్లలకు పెట్టకపోవడం మంచిది. ఎప్పటికప్పుడు మెనులో మార్పులు చేస్తూ వుండండి. కూరగాయలు, పండ్లు డైట్‌లో చేర్చాలి. డే కేర్‌లో పోషక ఆహారం లభిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఆహారం మాత్రమే కాకుండా సరైన డే కేర్ ఎంచుకునేందుకు తల్లిదండ్రులు సరైన స్థలం, సిబ్బంది, భద్రత వంటి కీలకమైన అంశాలను పరిశీలించాలి. 
 
ఆహారాన్ని పిల్లలకు ఎంత శుభ్రం పెడుతారో కూడా తెలుసుకోవాలి. డే కేర్ ఆహార మెనూలో తాజా పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, గుడ్లు వుండేలా చూసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు