మీ పిల్లలకు త్వరగా మాటలు రావాలంటే ఏం చేయాలి?

శుక్రవారం, 20 జూన్ 2014 (15:17 IST)
చిన్నప్పటి నుంచే పిల్లలతో మాట్లాడుతూ వుండాలి. లేకుంటే వినికిడి శక్తి తక్కువ అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో మాటలు కలుపుతూ వుంటేనే వారి మెదడు బాగా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. ఇంకా పిల్లలతో మాట్లాడటం అనేది మంచి పెరెంటింగ్ పద్ధతి అని వారు అంటున్నారు. 
 
మీ బిడ్డ అమ్మాయి లేదా అబ్బాయి ఆలోచన మీకంటే తెలివిగా ఉండొచ్చు. పిల్లలతో మాట్లాడడం వల్ల వారి మెదడు ఆ మాటలను చురుకుగా అందుకోవడానికి సహాయపడుతుంది. చిన్నతనం నుండే పిల్లలతో మాట్లాడుతూ ఉండడం అనేది పిల్లలకు త్వరగా మాటలు రావడానికి ఒక మంచి మార్గం. 
 
మీరు కొన్ని వారాల వయసు చిన్నారులతో మాట్లాడుతూ ఉన్నపుడు వారి వినికిడి శక్తిని కూడా మీరు గ్రహించగలుగుతారు. ఇది మీ పిల్లలకు మాటలు త్వరగా రావడానికి సహాయపడుతుంది. పిల్లల మనసు మనకంటే చాలా ఎక్కువ పదునుగా ఉండి, వారు ఆ మాటలను త్వరగా గ్రహించ గలుగుతారు. 
 
పిల్లలతో మాటలు కాకుండా భాష నేర్పించాలి. గ్రామర్ కూడా తప్పక ఉండేలా చూసుకోవాలి. పిల్లలు చక్కగా మాట్లాడాలంటే చిన్న చిన్న పదాలు మాట్లాడాలి. మళ్లీ పూర్తి వాక్యాలు మాట్లాడాలి. మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒకే భాష మాట్లాడండి. ఇంగ్లీషు, హిందీ కలిపి మాట్లాడక౦డి. వారు ఆ భాషలను విడి విడిగా నేర్చుకునే అవకాశం కల్పించండి. ఇలా చేస్తే మీ అమ్మాయి లేదా అబ్బాయి చక్కగా మాట్లాడతారని వైద్యులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి