ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం... త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్

మంగళవారం, 3 మార్చి 2026 (10:56 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం. ఇది శక్తిమంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, రానున్న 24 గంటల్లో ఆ దేశంలై భీకర దాడులు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
తాజాగా ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్‌పై తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదన్నారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 'మేము ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం. ఇది చాలా శక్తిమంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం' అని ట్రంప్‌ అన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవడం లేదన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్లు చెప్పారు. 
 
అరబ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులకు దిగడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. వారు తీవ్రస్థాయిలో ఇరాన్‌తో పోరాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌ దేశానికి నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే విషయం తనకు తెలియదన్నారు. తాము జరిపిన తొలి దాడుల్లోనే అక్కడి కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. యురేనియం శుద్ధిని ఆపేందుకు ఆ దేశం సిద్ధంగా లేదని.. వారిని అడ్డుకునేందుకు సైనిక చర్యే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు