మీ పిల్లలు అందంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఇవి పెట్టాలి...

సోమవారం, 20 ఆగస్టు 2018 (22:30 IST)
పిల్లలు అందంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఎదగాలి అంటే వారికి సరియైన పోషకాహారం అందించాలి. అప్పుడు మాత్రమే వారు చురుకుగా, చలాకీగా ఉంటారు. పిల్లల పెరుగుదలకు కావలసిన ఆహారపదార్ధాలు ఏమిటో తెలుసుకుందాం.
 
పాలు : పిల్లల పెరుగుదలకు ఇవి అత్యంత ఆవశ్యకమైనవి. పాల నుంచి వారికి  మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. పాలలోని క్యాల్షియం, ఫాస్పరస్ మూలకాలు ఎముకలు, దంతాలు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎ, బి2, బి12, డి, విటమిన్లు, జింక్ ఎముకలను దృఢంగా మారుస్తాయి. కాబట్టి ప్రతిరోజు రెండుపూటలా పిల్లలకు పాలు తాగడం అలవాటు చేయాలి.
 
చిక్కుళ్లు : ఇవి పిల్లల పెరుగుదలకు ముఖ్యపాత్ర వహిస్తాయి. వీటిలో అధిక మెుత్తంలో యాంటీఆక్సిడెంట్లు, మాంసకృత్తులు, పీచు, క్యాల్షియం, ఇనుము, విటమిన్ -బి ఉంటాయి. కొవ్వు శాతం కూడా తక్కువే. అంతేకాదు శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు, సోయా, రాజ్మా, ఉలవలలో శరీరానికి కావలసిన మంచి పోషకాలు లభిస్తాయి. వీటిని ఎదిగే పిల్లలకు పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
చీజ్ : పాల పదార్ధమైన దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ బి12, ఫాస్పరస్ ఉంటాయి. మాంస తీసుకోలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. 
 
గుడ్డు : పిల్లల పెరుగుదలలో దీని పాత్ర ప్రత్యేకం. దీనిలో ఎక్కువ మెుత్తంలో ఉండే మాంసకృత్తులు, విటమిన్-బి పోషకాలు మెదడు అభివృద్ధిలో  కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు ఒమెగా-3, ఫ్యాటీయాసిడ్లు, విటమిన్-డి, ఫోలియేట్, జింక్, ఇనుము, సెలీనియం ఉంటాయి. ఇవన్నీ పెరుగుదలకు సహాయపడేవే. కనుక ప్రతిరోజు పిల్లలకు గుడ్డును పెట్టడం వలన మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు