కావలసిన పదార్థాలు : మటన్ ఖీమా... అర కేజీ కోడిగుడ్డు... ఒకటి ఉల్లిపాయలు... రెండు బ్రెడ్ స్లైసెస్... రెండు అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీ. కారం... ఒక టీ. గరంమసాలా... ఒక టీ. కొత్తిమీర తురుము... ఒక టీ. పసుపు... అర టీ. కరివేపాకు, పుదీనా... కొద్దిగా ఉప్పు, నూనె... తగినంత
తయారీ విధానం : ఉల్లిపాయలను ముద్దగా నూరుకోవాలి. నూనె వేడిచేసి ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాల తరువాత కారం, పసుపు, మటన్ ఖీమా, ఉప్పు కూడా వేసి కలియబెట్టాలి. కాసేపు అలాగే వేయించాక.. గరంమసాలా, కొత్తిమీర తురుము, పుదీనా కూడా వేయాలి. అలాగే వేగుతున్న ఈ మిశ్రమం తడి ఇంకిపోయిన తరువాత దించేయాలి.
ఇది కాసేపు ఆరాక మిక్సీలో వేసి కాస్త గరుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కట్లెట్ల మాదిరిగా చేయాలి. వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ పొడిలో దొర్లించి బాగా కాగుతున్న నూనెలో వేసి, డీప్ ఫ్రై చేసి తీసేయాలి. నూనె వద్దనుకునేవారు, మైక్రోవేవ్ ఓవెన్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే మటన్ ఖీమా కట్లెట్స్ తయారైనట్లే...!