మధుర ఫలాలతో "ఫ్రూట్ ఆమ్లెట్"

కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు... ఎనిమిది
ఆపిల్ ముక్కలు... ఒక కప్పు
సీడ్‌లెస్ గ్రేప్స్... పది
ఖర్జూరం ముక్కలు... రెండు టీ.
బహ్రనీ... రెండు టీ.
పచ్చికొబ్బరి తురుము... రెండు టీ.
క్యారెట్ తురుము... రెండు టీ.
వేయించిన జీడిపప్పు... పదిహేను
ఫైనాఫిల్ ఎసెన్స్... మూడు టీ.
ఫైనాఫిల్ ముక్కలు... నాలుగు టీ.
పాలు... నాలుగు టీ.
పంచదారపొడి... రెండు టీ.
నెయ్యి... సరిపడా
టూటీ ఫ్రూటీ, చెర్రీస్... కొద్దిగా

తయారీ విధానం :
పండ్ల ముక్కలన్నింటినీ తరిగి ఒక పాత్రలో వేసి అందులో పంచదారపొడి సగం, ఎసెన్స్ సగం వేసి కలిపాలి. మరో పాత్రలో కోడిగుడ్డు సొనవేసి బాగా నురగవచ్చేదాకా బీట్ చేయాలి. అందులో పాలు, మిగిలిన పంచదారపొడి, ఎసెన్స్‌లను వేసి కలపాలి. ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక బీట్ చేసి ఉంచిన ఎగ్ మిశ్రమాన్ని పోసి మూతపెట్టి సన్నటి మంటమీద కాల్చాలి.

ఇది బాగా పొంగి లావుగా వేగిన వెంటనే, రెండోవైపు తిరగేసి కొంచెం కాలాక తీసేయాలి. చల్లారిన తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న ఫ్రూట్‌మిక్స్‌ను పెట్టి, ఆమ్లెట్‌ను రోల్ చేయాలి. సర్వ్ చేసేముందు కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, తేనెలతో గార్నిష్ చేయాలి. అంతే వెరైటీగా ఉండే ఫ్రూట్ ఆమ్లెట్ సిద్ధమయినట్లే...!

వెబ్దునియా పై చదవండి