కావలసిన పదార్థాలు : తియ్యటి మామిడిపండు గుజ్జు... 60 గ్రా. దాల్చిన చెక్క... 3 నీరు... 200 గ్రా. గ్లూకోజ్ ద్రవం... పది గ్రా. పంచదార... 50 గ్రా.
తయారీ విధానం : ముందుగా పంచదారను లేతపాకం పట్టి అందులో దాల్చిన చెక్క వేసి ఐదు నిమిషాలు పక్కనుంచాలి. తరువాత మామిడి గుజ్జు, గ్లూకోజ్ ద్రవం అందులో వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టడం మొదలవగానే ఫోర్క్‌తో దాన్ని చిదమాలి. ఇలా అంతా ఐస్ గుజ్జులా తయారయ్యేదాకా ఫోర్క్‌తో చిదుముతూనే ఉండాలి. తరువాత ఫ్రీజర్ నుంచి తీసి సర్వింగ్ కప్స్‌లోకి మార్చి సర్వ్ చేయాలి. అంతే తియ్యగా, కమ్మగా ఉండే "ఐస్ మ్యాంగో" తయారైనట్లే...! ఓ పట్టు పట్టేద్దామా...?!