కావలసిన పదార్థాలు : మామిడిపండ్లు... ఆరు పంచదార... అర కప్పు నీళ్లు... అర కప్పు పాలు... అర కప్పు మీగడ... మూడు టీ. కోడిగుడ్డు... ఒకటి
తయారీ విధానం : మామిడిపండ్ల పై తొక్క తీసి గుజ్జు తీసుకోవాలి. ఇందులో పంచదార వేసి కరిగేంతదాకా స్పూన్‌తో గిలకొట్టాలి. పాలను మరిగించి కోడిగుడ్డు పగులగొట్టి అందులో వేయాలి. అలాగే సన్నటి సెగపై చిక్కబడేంతదాకా కలుపుతూ ఉడికించాలి. దించి, చల్లబడ్డాక అందులో మామిడిపండు గుజ్జు, మీగడ, ఒక చుక్క మ్యాంగో ఎసెన్స్ వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తరువాత సర్వింగ్ కప్స్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో ఫుడ్డింగ్ రెడీ అయినట్లే...!
ఎసిడిటీ, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడం వంటి సమస్యలను దూరం చేసే సుగుణాలు మామిడిపండులో ఉన్నాయి. దీంట్లో ఉండే "ఎ" విటమిన్ కంటి సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. పాలల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలపరుస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో శారీరక రుగ్మతలను సైతం దూరం చేస్తాయి.