ఆకట్టుకుంటున్న 'బెంగుళూరు కేకు ప్యాలెస్"

శనివారం, 22 డిశెంబరు 2007 (12:54 IST)
PTI PhotoPTI
దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగుళూరు ఒకటి. గార్డెన్ నగరంగా పేరొందిన బెంగుళూరులో.. భారతీయ సంస్కృతిని ప్రతిబింభించే చారిత్మాక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి విధాన్ సౌధ, బెంగుళూరు ప్యాలెస్‌లు. అయితే.. క్రైస్తవ సోదరుల పవిత్ర పండుగ క్రిస్మస్‌ను పురస్కరించుకుని కొన్ని సంస్థలు ఈ భవంతుల ఆకారంలో 'కేకు భవనాల'ను తయారు చేస్తున్నాయి.

ఆ కోవలోనే నీల్గిరీస్‌కు చెందిన 25 మంది సిబ్బంది కలసి బెంగుళూరు ప్యాలెస్ ప్రతిరూపాన్ని కళ్ళకు కట్టినట్టు కేకు ప్యాలెస్‌ను నిర్మించారు. ఇందుకోసం.. వారు 4.5 టన్నుల చక్కెరను ఉపయోగించారు. ఈ కేకు పొడవు 62.5 అడుగులు ఉండగా, 19 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో నిర్మించారు. బెంగుళూరులో ప్రారంభమైన కేకుల ప్రదర్శన కోసం ఈ బెంగుళూరు ప్యాలెస్ కేకును తయారు చేయగా.. ఇది ఆ ప్రదర్శనకే హైలెట్‌గా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి